మొన్న 350.. నిన్న 640.. నేడు 752 మందికి కరోనా పాజిటివ్
- దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులు.. 24 గంటల్లో నలుగురి మృతి
- కేరళలోనే ఎక్కువగా బయటపడుతున్న వైరస్
- జేఎన్.1 సబ్ వేరియంట్ వ్యాప్తితో కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాల అలర్ట్
వైరస్ తో గడిచిన 24 గంటల్లో నలుగురు చనిపోయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు. జేఎన్.1 సబ్ వేరియంట్ కేసులు బయటపడ్డ కేరళలోనే వైరస్ బాధితుల సంఖ్య ఎక్కువగా నమోదవుతోందని తెలిపారు. నిన్న బయటపడ్డ కొత్త కేసులు మొత్తం 752 కాగా అందులో 565 మంది కరోనా బాధితులు కేరళలోనే ఉన్నారని వివరించారు. యాక్టివ్ కేసులు కూడా కేరళలోనే అత్యధికమని, వైరస్ బాధితులలో 2,872 మంది కేరళలోనే ఉన్నారని చెప్పారు. గోవాలోనూ జేఎన్.1 సబ్ వేరియంట్ కేసులు 21 నమోదయ్యాయని చెప్పారు.