ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు మరోసారి ఈడీ నోటీసులు
- ఢిల్లీ మద్యం కుంభకోణం ఆరోపణలపై జనవరి 3న విచారణకు రావాలన్న ఈడీ
- గతంలో రెండు సార్లు నోటీసులు ఇచ్చినా హాజరుకాని ఢిల్లీ ముఖ్యమంత్రి
- ఈసారి ఏం చేయబోతున్నారనే దానిపై ఉత్కంఠ
ఈడీ తొలుత నవంబర్ 2న విచారణకు రావాలని కేజ్రీవాల్‌కు నోటీసులు పంపించింది. అయితే, మధ్యప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో ఆయన వెళ్లలేదు. డిసెంబర్ 21న కూడా ఆయన విచారణకు గైర్హాజరయ్యారు. ప్రతి పక్షాల గొంతు నొక్కేందుకు ఈడీని ప్రయోగిస్తున్నారంటూ ఆయన అప్పట్లో ఆగ్రహం వ్యక్తం చేశారు.