బిగ్ బాస్ ఫినాలే రోజున ఘర్షణకు విజేత పల్లవి ప్రశాంతే కారణం: డీసీపీ
- బిగ్ బాస్ ఫినాలే ముగిశాక జరిగిన ఘర్షణలో ఆరు బస్సులు, పోలీసుల వాహనాలు దెబ్బతిన్నాయన్న డీసీపీ
- పోలీసులకూ గాయాలైనట్లు తెలిపిన వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్
- ఘర్షణ జరిగిన రోజున అక్కడి నుంచి వెళ్లిపోవాలని పల్లవి ప్రశాంత్‌కు చెబితే మళ్లీ వెనక్కి వచ్చారన్న డీసీపీ
అక్కడి నుంచి వెళ్లిపోవాలని పల్లవి ప్రశాంత్‌కు పోలీసులు సూచించారని, కానీ అతను ముందుకు వెళ్లి మళ్లీ వెనక్కి వచ్చారన్నారు. ఎక్కువమంది గుమికూడటానికి... ఘర్షణ తలెత్తడానికి అతడే కారణమని గుర్తించినట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి రెండు కేసులు నమోదు కాగా, తొలి కేసులో ప్రశాంత్ సహా ముగ్గురిని అరెస్ట్ చేశామని, ఒకరు పరారీలో ఉన్నారని వెల్లడించారు. రెండో కేసులో ఇప్పటి వరకు 16 మందిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు.