హైదరాబాద్‌లో 14 నెలల చిన్నారికి కరోనా.. ఆక్సిజన్ సాయంతో చికిత్స అందిస్తున్న నిలోఫర్ వైద్యులు
- తీవ్ర జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులతో ఆసుపత్రిలో చేరిన చిన్నారి
- ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స
- పాప కోలుకుంటోందన్న వైద్యులు
పరీక్షించిన వైద్యులు ఆ చిన్నారికి కరోనా సోకినట్టు నిర్ధారించారు. అనంతరం ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం పాప ఆరోగ్యం నిలకడగానే ఉందని, కోలుకుంటోందని వైద్యులు తెలిపారు. ఆసుపత్రికి తీసుకొచ్చిన సమయంలో చిన్నారి పరిస్థితి దృష్ట్యా వెంటిలేటర్ పై ఉంచి చికిత్స చేయడం జరిగిందనీ, ప్రస్తుతం దానిని తొలగించి ఆక్సిజన్ అందిస్తున్నట్టు పేర్కొన్నారు.
మరోవైపు, రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గురువారం నాటికి కేసుల సంఖ్య 20కి చేరింది. వీరిలో ఒకరు కోలుకుని డిశ్చార్జ్ కాగా, మిగతా 19 మంది ఐసోలేషన్‌లో ఉన్నారు. కొత్త కేసుల్లో నాలుగు హైదరాబాద్‌లో నమోదు కాగా, మెదక్, రంగారెడ్డిలో చెరో కేసు వెలుగుచూసినట్టు అధికారులు తెలిపారు.