వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో కరోనా కేసు కలకలం.. కొట్టి పారేసిన వైద్యులు
- భూపాలపల్లికి చెందిన 41 ఏళ్ల మహిళ కరోనా లక్షణాలతో ఎంజీఎం కొవిడ్ వార్డులో చేరిందని ప్రచారం
- మరో ముగ్గురిని కూడా అనుమానితులుగా గుర్తించినట్లు వాట్సాప్‌లో చక్కర్లు
- ఆందోళన అవసరం లేదన్న వైద్యాధికారులు
దీంతో పాటు వారి నుంచి నమూనాలు సేకరించి హైదరాబాద్ ల్యాబ్‌కు పంపించినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే ఇప్పటి వరకు ఎంజీఎం కొవిడ్ వార్డులో ఎలాంటి అనుమానితులు గానీ లేదా కరోనా జేఎన్.1 లక్షణాలు ఉన్నవారు గానీ నమోదు కాలేదని అధికారులు తెలిపారు. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలను అనుసరించి 50 పడకలతో కొవిడ్ వార్డును ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.