Rahul Dravid: అచ్చం తండ్రిలా.. రాహుల్ ద్రవిడ్ కుమారుడి బ్యాటింగ్ స్టైల్ వైరల్.. వీడియో ఇదిగో!

Rahul Dravis Son Samit Takes Internet By Storm Here Is The Video
  • కూచ్ బెహర్‌లో భాగంగా జమ్మూకశ్మీర్‌తో మ్యాచ్
  • బ్యాటింగ్‌లో 90 పరుగులు చేసి మూడు వికెట్లు పడగొట్టిన సమిత్
  • తండ్రి జీన్స్ పోతపోసినట్టు వచ్చాయంటూ అభిమానుల కామెంట్లు
టీమిండియా మాజీ సారథి, ప్రస్తుత చీఫ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కుమారుడు సమిత్‌‌కు సంబంధించిన బ్యాటింగ్ వీడియో వైరల్ అవుతోంది. కూచ్ బెహర్ ట్రోఫీలో భాగంగా నిన్న జమ్మూకశ్మీర్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్దిరిపోయే బ్యాటింగ్‌తో అభిమానుల మనసులు దోచుకున్నాడు. అచ్చం తండ్రిని తలపించాడు. 

18 ఏళ్ల సమిత్ 98 పరుగులు చేసి కర్ణాటక జట్టు ఇన్నింగ్స్ 130 పరుగుల తేడాతో విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. బౌలింగ్‌లోనూ సత్తాచాటి మూడు వికెట్లు పడగొట్టాడు. అద్భుతమైన కవర్ డ్రైవ్ షాట్స్‌తో సమిత్ తండ్రి ద్రవిడ్‌ను తలపించాడంటూ అభిమానులు కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. అతడి ఫ్రంట్‌ఫుట్‌లు, కవర్ డ్రైవ్‌లు చూసిన వారు అతడిలో తండ్రి జీన్స్ పోతపోసినట్టు కనిపిస్తున్నాయంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
Rahul Dravid
Samit Dravid
Cooch Behar Trophy
Karnataka

More Telugu News