తెలంగాణ నుంచి అయోధ్యకు ప్రత్యేక రైళ్లు నడపనున్న బీజేపీ!

BJP to runs trains from Telangana to Ayodhya
  • వచ్చే నెలలో రామమందిర విగ్రహప్రతిష్ఠాపన
  • ప్రతి లోక్ సభ నియోజకవర్గం నుంచి ఒక్కో రైలు నడిపే అవకాశం
  • త్వరలో ఇందుకు సంబంధించి నిర్ణయం
కోట్లాదిమంది హిందువుల కల.. అయోధ్య రామమందిర విగ్రహప్రతిష్ఠాపన వచ్చే నెలలో జరగనుంది. ఈ వేడుకను చూసేందుకు ఎంతోమంది భక్తులు రానున్నారు. ఈ క్రమంలో తెలంగాణ నుంచి అయోధ్యకు బీజేపీ ప్రత్యేక రైళ్లను నడపాలని భావిస్తోంది. ప్రతి లోక్ సభ నియోజకవర్గం నుంచి ఒక రైలును నడపనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. రామాలయ ప్రారంభోత్సవానికి ఒక్కో నియోజకవర్గం నుంచి ఒక్కో రైలును సొంత ఖర్చుతో పంపించాలని బీజేపీ చూస్తోంది. ఈ విషయమై త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇందుకు రాష్ట్ర బీజేపీ కసరత్తు చేస్తోంది. ఇందుకు సంబంధించి త్వరలో షెడ్యూల్ ఖరారు కానుంది. జనవరి 22 తర్వాత రాష్ట్రం నుంచి అయోధ్యకు ప్రత్యేక రైలు ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.
Advertisement
Ayodhya Ram Mandir
Ayodhya Temple Trust
Telangana
train

More Telugu News