Devara: 'దేవర'లో ప్రతి ఫైటూ ఓ క్లైమాక్స్!

  • షూటింగు దశలో ఉన్న 'దేవర'
  • జనవరి ఫస్టు వీక్ నుంచి నెక్స్ట్ షెడ్యూల్ 
  • భారీస్థాయిలో జరగనున్న యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరణ
  • ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్న జాన్వీ కపూర్ 
  • ఏప్రిల్ 5వ తేదీన సినిమా విడుదల

Devara Movie Update

ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానులంతా 'దేవర' సినిమా కోసమే వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఆయన గెటప్ డిఫరెంట్ గా ఉంది. సముద్రతీర ప్రాంతానికి సంబంధించిన కథతో ఈ సినిమా నడుస్తుంది. అందుకు తగినట్టుగానే దర్శకుడు కొరటాల ఆయన లుక్ ను డిజైన్ చేశాడు. ఎన్టీఆర్ ఫస్టులుక్ తోనే ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ ఏ రేంజ్ లో ఉంటాయనేది ఆడియన్స్ కి అర్థమైపోయింది. 

ఈ సినిమాకి సంబంధించిన తదుపరి షెడ్యూల్ ను జనవరి మొదటి వారంలో ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా సైఫ్ అలీఖాన్ కనిపించనున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ - సైఫ్ కాంబినేషన్ లోని రెండు భారీ యాక్షన్ సన్నివేశాలను ఈ షెడ్యూల్ లో చిత్రీకరించనున్నట్టుగా చెబుతున్నారు. 

ఈ షెడ్యూల్ లో జరిగే పోరాట సన్నివేశాలను పీటర్ హెయిన్ డిజైన్ చేశాడు. యాక్షన్ ఎపిసోడ్స్ చాలా కొత్తగా .. ఆశ్చర్యపోయేలా ఉంటాయనీ, ప్రతి ఫైటూ క్లైమాక్స్ లా అనిపిస్తుందని అంటున్నారు. ఇక ఈ సినిమాతోనే టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న జాన్వీ కపూర్ ప్రత్యేక ఆకర్షణ. ఏప్రిల్ 5వ తేదీన పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

More Telugu News