బీసీసీఐ కీలక నిర్ణయం.. ధోనీ జెర్సీ నంబర్ 7కు రిటైర్మెంట్.. ఆటగాళ్లకు ఆదేశాలు
- టీమిండియా మాజీ సారథి ధోనికి అరుదైన గౌరవం
- సచిన్ జెర్సీ నంబర్ 10 లానే.. నంబర్ 7 జెర్సీకి కూడా రిటైర్మెంట్
- మరే ఆటగాడు దీనిని ఎంచుకోవద్దని బీసీసీఐ ఆదేశాలు
నంబర్ 7 జెర్సీకి రిటైర్మెంట్ ప్రకటించాలని బీసీసీఐ నిర్ణయించిందని, కాబట్టి ఆటగాళ్లు ఎవరూ ఆ నంబరును ఎంచుకోవద్దని ప్లేయర్లకు బీసీసీఐ సమాచారమిచ్చినట్టు ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ ఓ కథనంలో పేర్కొంది. భారత యువ ఆటగాడు శార్దూల్ ఠాకూర్ మొదట్లో కొద్దికాలంపాటు నంబర్ 10 జెర్సీ ధరించాడు. ఇది చర్చనీయాంశం కావడంతో ఆ తర్వాత దానిని వదిలిపెట్టాడు. కాగా, బీసీసీఐ ప్రస్తుతం 60 నంబర్లను జట్టులోని రెగ్యులర్ ఆటగాళ్ల కోసం కేటాయించింది. ఎవరైనా ఆటగాడు జట్టుకు ఏడాది దూరంగా ఉన్నా సరే అతడి నంబరును కొత్త ఆటగాడికి ఇవ్వబోమని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. దీనిని బట్టి అరంగేట్ర ఆటగాడు ఎంచుకునేందుకు 30 నంబరు మాత్రమే ఉన్నట్టు పేర్కొన్నారు.