నెలసరిలో మహిళలకు జీతంతో కూడిన సెలవులు అవసరం లేదు: స్మృతీ ఇరానీ
- నెలసరి రోజుల్లో మహిళలకు సెలవుల జారీపై రాజ్యసభలో ప్రశ్న
- నెలసరి వైకల్యం కాదని స్మృతి ఇరానీ వ్యాఖ్య
- మహిళల జీవన ప్రయాణంలో అదో భాగమని వివరణ
- ఇవి తన వ్యక్తిగత అభిప్రాయాలని స్పష్టీకరణ
నెలసరి సహజ ప్రక్రియ అని, కొందరు మహిళలకు ఆ సమయంలో శారీరక బాధలు ఉన్నా మందులతో ఉపశమనం పొందవచ్చని తెలిపారు. అయితే, ఈ అంశంపై సమాజం ఇప్పటికీ మౌనంగానే ఉంటోందని, ఈ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమాజంలో అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు.
మహిళా ఉద్యోగులకు నెలసరిలో జీతంతో కూడిన సెలవులు మంజూరు తప్పనిసరి చేయాలన్న ప్రతిపాదన ఏదైనా ఉందా? అని ఎంపీ శశిథరూర్ గతవారం లోక్‌సభలో ప్రశ్నించారు. అయితే, అలాంటి ప్రతిపాదన ఏదీ పరిశీలనలో లేదని స్మృతి పేర్కొన్నారు.