వైఎస్, కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్లలో మంత్రిగా పనిచేసిన గడ్డం ప్రసాద్ చదివింది ఇంటరే!
- టీఎస్ అసెంబ్లీ స్పీకర్ పదవికి గడ్డం ప్రసాద్ నామినేషన్
- ప్రసాద్ నామినేషన్ కు బీఆర్ఎస్ మద్దతు
- వికారాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన ప్రసాద్
రంగారెడ్డి జిల్లా మర్పల్లిలో జన్మించిన ప్రసాద్... 2008 ఉపఎన్నికలో వికారాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచారు. వైఎస్ రాజశేఖర రెడ్డి కేబినెట్ లో మంత్రిగా పని చేశారు. ఆ తర్వాత 2012లో కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్లో మంత్రిగా బాధ్యతలను నిర్వర్తించారు. 2014, 2018 ఎన్నికల్లో ఆయన వరుసగా ఓటమిపాలయ్యారు. అయితే 2022లో టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా నియమితులయ్యారు. ఈ ఎన్నికల్లో ఆయన వికారాబాద్ నుంచి విజయం సాధించారు. ఇప్పుడు స్పీకర్ గా బాధ్యతలను స్వీకరించనున్నారు.