లండన్‌లో రూ.1,444 కోట్ల విలువైన భవనాన్ని కొనుగోలు చేయనున్న అదార్ పూనావాలా
- లండన్‌లోని మేఫెయిర్ ప్రాంతంలోని ‘అబెర్కాన్వే హౌస్’ కొనుగోలు
- 1920ల నాటి విలాసవంతమైన భవనాన్ని దక్కించుకున్న సీరం ఇన్స్టిట్యూట్ సీఈవో
- కుటుంబ సభ్యులు యూకేకి వెళ్లినప్పుడు నివాసం కోసం కొనుగోలు
పూనావాలా కుటుంబానికి శాశ్వతంగా యూకేకి నివాసం మార్చుకునే ఉద్దేశంలేదని, అయితే యూకే సందర్శనల సమయాల్లో నివాసం కోసం మాత్రమే ఈ భవనాన్ని కొనుగోలు చేసినట్టు సీరమ్ లైఫ్ సైన్సెస్‌కు చెందిన వర్గాలు పేర్కొన్నాయి. కుటుంబ సభ్యులతోపాటు కంపెనీకి కూడా స్థావరంగా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో కొనుగోలు చేసినట్టు రిపోర్టులు పేర్కొంటున్నాయి.