ఐపీఎల్ కు కొత్త స్పాన్సర్... టెండర్లు పిలిచిన బీసీసీఐ
- 2024-28 వరకు స్పాన్సర్ షిప్ కు టెండర్ల ఆహ్వానం
- జనవరి 8 వరకు దరఖాస్తుల కొనుగోలు గడువు
- దరఖాస్తు కొనుగోలు ఫీజును రూ.5 లక్షలుగా నిర్ణయించిన బీసీసీఐ
టెండర్ వేయదలచిన సంస్థలు రూ.5 లక్షల దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఫీజు తిరిగి చెల్లించరు. నిర్ణీత రుసుం రూ.5 లక్షలు (జీఎస్టీ అదనం) చెల్లించి బీసీసీఐ నుంచి దరఖాస్తులు పొందేందుకు జనవరి 8 వరకు గడువు ఇచ్చారు.
ఈ దరఖాస్తును ఇన్విటేషన్ టు టెండర్ (ఐటీటీ) డాక్యుమెంట్ గా బీసీసీఐ పేర్కొంది. ఈ ఐటీటీ డాక్యుమెంట్ లో నియమ నిబంధనలు, టెండరు ప్రక్రియ వివరాలు, అర్హత నియమావళి, బిడ్డింగ్ దాఖలు, హక్కులు, ఇతర వివరాలు ఉంటాయి.
కాగా, బిడ్డింగ్ ప్రక్రియను ఏ దశలోనైనా నిలుపుదల చేసేందుకు, సవరణలు చేసేందుకు తమకు పూర్తి హక్కులు ఉంటాయని బీసీసీఐ తన ప్రకటనలో పేర్కొంది.