Top Google Searches: ఈ ఏడాది గూగుల్‌లో భారతీయులు ఎక్కువగా వెతికినవి ఇవే!

Heres What India Googled In 2023
షార్ట్స్‌లో చూడండి
ఈ ఏడాది ముగింపునకు వచ్చేసింది. కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు ప్రపంచం సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలో ఏడాది కాలంగా జరిగిన అనేక విషయాలపై సమీక్షలు కూడా మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో గూగుల్ తాజాగా ఈ సంవత్సరం గూగుల్ సెర్చ్ ట్రెండ్స్‌పై నివేదిక విడుదల చేసింది. ఇండియాతో పాటూ ప్రపంచవ్యాప్తంగా జనాలు గూగుల్‌లో ఏ అంశాలను వెతికారో వెల్లడించింది. గూగుల్ వివరాల ప్రకారం గూగుల్‌ ఇండియా సెర్చ్ ఫలితాల్లో చంద్రయాన్-3 తొలి స్థానంలో నిలిచింది. 
భారత్‌లో జనాలు గూగుల్‌లో అత్యధికంగా వెతికిన అంశాలు:

  • చంద్రయాన్-3
  • కర్ణాటక ఎన్నికల ఫలితాలు
  • ఇజ్రాయెల్ వార్తలు
  • సతీశ్ కౌశిక్
  • బడ్జెట్ 2023
  • తుర్కియే భూకంపం
  • ఆతిక్ అహ్మద్
  • మాథ్యూ పెర్రీ (అమెరికన్ టీవీ నటుడు)
  • మణిపూర్ న్యూస్
  • ఒడిశా ట్రైన్ యాక్సిడెంట్
ఇక ప్రశ్నల పరంగా చూస్తే.. జీ20 అంటే ఏంటి? యూసీసీ అంటే ఏంటి? చాట్‌జపీటీ అంటే ఏంటి? అనేవి అత్యధికులు అడిగిన ప్రశ్నలుగా నిలిచాయి.
Go Back to Shorts
Top Google Searches
India

More Telugu News