Prabhas: ప్రభాస్ 'సలార్' చిత్రానికి A సర్టిఫికెట్ ఇచ్చిన సెన్సార్ బోర్డు

  • ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో సలార్
  • తొలి భాగం సలార్: సీజ్ ఫైర్ డిసెంబరు 22న విడుదల
  • సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న చిత్రం 
  • ఇటీవల వచ్చిన ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్
Prabhas Salaar has done censor with A certificate

అసలు సిసలైన యాక్షన్ చిత్రంగా ప్రచారంలో ఉన్న ప్రభాస్ సలార్ చిత్రం సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు A సర్టిఫికెట్ మంజూరు చేసింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ భారీ చిత్రం డిసెంబరు 22న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఇటీవల రిలీజైన సలార్ ట్రైలర్ చూస్తే యాక్షన్ కా బాప్ అనిపించేలా ఉంది. 

కాగా, సలార్ రెండు భాగాలుగా వస్తోంది. మొదటి భాగం సలార్: సీజ్ ఫైర్ పేరుతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇందులో ప్రభాస్ సరసన శ్రుతిహాసన్ కథానాయిక. 

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోంది. ఇందులో ప్రథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. జగపతిబాబు, టినూ ఆనంద్, ఈశ్వరీ రావు, శ్రియా రెడ్డి, గరుడ రామ్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందించారు.

More Telugu News