యశోద ఆసుపత్రిలో కేసీఆర్‌ను పరామర్శించిన సీఎం రేవంత్‌రెడ్డి

CM Revanth Reddy Visited Yashoda Hospital To See KCR
  • షబ్బీర్ అలీ, సీతక్కతో కలిసి ఆసుపత్రికి రేవంత్
  • వైద్యులను అడిగి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా
  • వేగంగా కోలుకుంటున్నారన్న వైద్యులు
ఎర్రవల్లి ఫాంహౌస్ బాత్రూంలో జారిపడి హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కొద్దిసేపటి క్రితం సీఎం రేవంత్‌రెడ్డి పరామర్శించారు. వైద్యులను అడిగి కేసీఆర్ ఆరోగ్యపరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రేవంత్‌రెడ్డి వెంట మంత్రి సీతక్క, షబ్బీర్ అలీ ఉన్నారు. 

కేసీఆర్‌కు శుక్రవారం రాత్రి వైద్యులు తుంటి మార్పిడి ఆపరేషన్ చేశారు. నిన్న వాకర్ సాయంతో కేసీఆర్‌ను వైద్యులు నడిపించారు. కేసీఆర్ కోలుకునేందుకు ఆరు నుంచి 8 వారాల సమయం పట్టే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన వేగంగా కోలుకుంటున్నట్టు చెప్పారు.
Advertisement
Revanth Reddy
KCR
Yashoda Hospital
Somajiguda

More Telugu News