Bandaru Dattatreya: ప్రధాని మోదీని కీర్తిస్తూ పాట పాడిన బండారు దత్తాత్రేయ మనవరాలు... వీడియో ఇదిగో!

  • మనవరాలి పాటను ఆస్వాదించిన దత్తన్న
  • ఎక్స్ లో వీడియో పంచుకున్న వైనం
  • వీడియో పట్ల నెటిజన్ల స్పందన
Bandaru Dattatreya grand daughter recites song on PM Modi

హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ మనవరాలు ప్రధాని నరేంద్ర మోదీని కీర్తిస్తూ పాడిన పాట సోషల్ మీడియాలో వైరల్ అయింది. దత్తాత్రేయ కుటుంబ సభ్యుల సమక్షంలో ఆ చిన్నారి మోదీపై పాట పాడింది. మోదీ ఘనతలను వివరిస్తూ హిందీలో ఆలపించింది. ఆ పాప పాడుతుండగా దత్తన్న కుటుంబ సభ్యులు ఎంతోగానో ఆస్వాదించారు. ఈ వీడియోను దత్తాత్రేయ తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. "నా మనవరాలు జశోధర ప్రధాని మోదీని స్తుతిస్తూ ఓ గీతం ఆలపించింది" అని వివరించారు. కాగా, ఈ వీడియోకు నెటిజన్ల నుంచి విశేష స్పందన వస్తోంది.

More Telugu News