కేసీఆర్ ఓ ఫైటర్.. సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్
- కేసీఆర్‌ను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
- అడ్డంకులు ఎదుర్కొని మరీ కేసీఆర్ తెలంగాణ సాధించారన్న కేటీఆర్
- కేసీఆర్ సారథ్యంలో అసెంబ్లీలో ప్రజా గొంతుక అవుతామన్న మాజీ మంత్రి
కేసీఆర్ నాయకత్వంలో అసెంబ్లీలో తెలంగాణ ప్రజల గొంతుక అవుతామని పేర్కొన్నారు. ఈ ఉదయం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ఎల్పీ సమావేశం జరిగింది. సీనియర్ నాయకుడు కేశవరావు అధ్యక్షతన జరిగిన ఈ భేటీకి పార్టీ ఎమ్మెల్యేలు 38 మంది హాజరయ్యారు. శస్త్ర చికిత్స కారణంగా పార్టీ అధినేత, గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ గైర్హాజరయ్యారు.