మీ తీర్పుల్లో అనవసర వ్యాఖ్యానాలు వద్దు.. జడ్జీలకు సుప్రీం కోర్టు సూచన
- టీనేజ్ బాలికలు కోరికలు నియంత్రించుకోవాలంటూ కలకత్తా హైకోర్టు వ్యాఖ్య
- కలకత్తా హైకోర్టు వ్యాఖ్యలపై సుప్రీం కోర్టు తీవ్ర అభ్యంతరం
- ఇలాంటి వ్యాఖ్యలు టీనేజర్ల హక్కుల ఉల్లంఘన కిందకు వస్తాయని స్పష్టీకరణ
ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళితే, తననే పెళ్లిచేసుకోవాలని ఒత్తిడి చేసేందుకు నిందితుడు మహిళను కిడ్నాప్ చేశాడు. అయితే, ఈ కేసులో నిందితుడికి పోక్సో చట్టం సెక్షన్ 6 ప్రకారం శిక్ష విధించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ విచారణ సంరద్భంగా కలకత్తా హైకోర్టులోని జస్టిస్ చిత్తరంజన్ దాస్, జస్టిస్ పార్థసారథి సేన్ ధర్మాసనం ఈ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసింది.