రిజర్వు బ్యాంకు వడ్డీ రేట్లు యథాతథం.. ఆసుపత్రులు, విద్యాసంస్థలకు యూపీఐ చెల్లింపు పరిమితి 5 లక్షలకు పెంపు
- మూడు రోజులపాటు సమావేశమైన ఆర్బీఐ ఎంపీసీ
- ఎంపీసీ తీసుకున్న నిర్ణయాలను వెల్లడించిన గవర్నర్ శక్తికాంతదాస్
- రెపోరేటులో ఎలాంటి మార్పు చేయలేదన్న ఆర్బీఐ
ఎంపీసీలో తీసుకున్న కీలక నిర్ణయాలు
* ఆసుపత్రులు, విద్యాసంస్థలకు యూపీఐ చెల్లింపు పరిమితి లక్ష నుంచి 5 లక్షలకు పెంపు
* రికరింగ్ చెల్లింపుల ఈ-మ్యాండేట్ పరిమితి రూ. 15 వేల నుంచి లక్షకు పెంపు
* డిజిటల్ లెండింగ్‌లో పారదర్శకత పెంపునకు రుణ ఉత్పత్తుల వెబ్ అగ్రిగేషన్ కోసం రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్
* ఫిన్‌టెక్ రిపోజిటరీ ఏప్రిల్ 2024 నాటికి ఆర్బీఐ ఇన్నోవేషన్ హబ్ ద్వారా నిర్వహిస్తారు.