Chiranjeevi: నూతన సీఎం రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి

 Chiranjeevi wishes Telangana New CM Revanth Reddy
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి కొద్దిసేపటి కిందట పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆయనతో రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేయించారు. ఈ నేపథ్యంలో, సీఎం రేవంత్ రెడ్డికి టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. 

"తెలంగాణ కొత్త ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి హార్దిక శుభాభినందనలు. మీ నాయకత్వంలో మన రాష్ట్రం గొప్పగా అభివృద్ధి పథంలోకి దూసుకెళ్లాలని, ఉన్నతస్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తున్నాను" అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. అంతేకాదు, డిప్యూటీ సీఎంగా నియమితుడైన మల్లు భట్టి విక్రమార్కకు, నూతన మంత్రివర్గానికి, కాంగ్రెస్ శాసనసభాపక్షానికి కూడా చిరంజీవి విషెస్ తెలిపారు. 

గతంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టిన చిరంజీవి... కొన్ని పరిణామాల నేపథ్యంలో తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడం తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రి పదవిలోనూ కొనసాగారు. చిరంజీవి కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నప్పటికీ... పార్టీకి రాజీనామా చేయకపోవడం వల్ల సాంకేతికంగా ఇంకా కాంగ్రెస్ లోనే ఉన్నారని భావించాలి.
Go Back to Shorts
Chiranjeevi
Revanth Reddy
Chief Minister
Telangana
Congress

More Telugu News