సోనియా, రాహుల్, ప్రియాంకలతో కలిసి ఒకే కారులో రేవంత్ రెడ్డి
- ఎల్బీ స్టేడియానికి బయలుదేరిన కాన్వాయ్
- ప్రజలకు అభివాదం చేస్తూ వెళుతున్న కాంగ్రెస్ నేతలు
- మరికాసేపట్లో రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం
హోటల్ నుంచి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలతో కలిసి రేవంత్ రెడ్డి ఎల్బీ స్టేడియానికి బయలుదేరారు. కారులో రాహుల్ ముందు కూర్చోగా, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డి వెనక సీటులో కూర్చున్నారు. సెక్యూరిటీ సిబ్బంది కార్లు అనుసరిస్తుండగా వారి కాన్వాయ్ ముందుకు సాగింది. రోడ్డు పక్కన నిలుచుని నినాదాలు చేస్తున్న ప్రజలకు అభివాదం చేస్తూ రాహుల్, రేవంత్ లు ముందుకు సాగారు.