రేవంత్ రెడ్డికి నా ఎంపీ ఫ్లాట్ లో ఆతిథ్యం ఇవ్వడం ఆనందంగా ఉంది: మాణికం ఠాగూర్
- ఢిల్లీలో బిజీబిజీగా రేవంత్ రెడ్డి
- మాణికం ఠాగూర్ ను కలిసి ప్రమాణస్వీకారానికి ఆహ్వానించిన రేవంత్
- రాష్ట్రాన్ని రేవంత్ అభివృద్ధి పథం వైపు తీసుకెళ్తారనే నమ్మకం ఉందన్న మాణికం
ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా మాణికం ఠాగూర్ స్పందిస్తూ.... ఒక సోదరుడిగా తెలంగాణ ముఖ్యమంత్రికి తన ఎంపీ ఫ్లాట్ లో ఆతిథ్యం ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. రేపు హైదరాబాద్ లో జరిగే చారిత్రాత్మక ఘట్టానికి తనను ఆహ్వానించడానికి రేవంత్ వచ్చారని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఉన్నత శిఖరాలకు ఎక్కించినట్టే... రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి పథం వైపు నడిపిస్తారనే నమ్మకం తనకు ఉందని చెప్పారు.