చంద్రయాన్-3పై లేటెస్ట్ అప్డేట్ ఇచ్చిన ఇస్రో.. అరుదైన ప్రయోగం సక్సెస్
- ప్రొపల్షన్ మాడ్యూల్‌ను చంద్ర కక్ష్య నుంచి భూకక్ష్యలోకి ప్రవేశపెట్టినట్టు ప్రకటన
- అరుదైన ప్రయోగంలో విజయవంతమయ్యామని వెల్లడి
- ‘ఎక్స్’ వేదికగా తాజా సమాచారాన్ని పంచుకున్న ఇస్రో
కాగా.. చంద్రుడి దక్షిణ ధృవంపై సాఫ్ట్ ల్యాండింగ్ ప్రధాన లక్ష్యంగా ఈ ఏడాది జులై 14న ఇస్రో చంద్రయాన్-3 ప్రయోగాన్ని చేపట్టింది. శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుంచి రాకెట్ ప్రయోగాన్ని చేయగా ఆగస్టు 23న విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండ్ అయ్యింది. అనంతరం అందులోని ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుడిపై తిరుగాడుతూ అక్కడి పరిస్థితులపై ప్రయోగాలు చేపట్టింది. ఈ మేరకు ఇస్రో శాస్త్రవేత్తలకు సమాచారాన్నిఅందించింది. 14 రోజుల తర్వాత ‘స్లీపింగ్ మోడ్’లో వెళ్లింది. ఆ తర్వాత ప్రజ్ఞాన్ రోవర్‌ను మేల్కొలిపేందుకు శాస్త్రవేత్తలు ప్రయోగించినా ఫలితం దక్కలేదన్న విషయం తెలిసిందే.