"మిస్టర్ పవన్" అంటూ మంత్రి అంబటి రాంబాబు కౌంటర్
- తనకు బ్యానర్లు కట్టినవాళ్లు ఏపీలో మంత్రులుగా ఉన్నారన్న పవన్
- బ్యానర్లు కట్టినవాళ్లను కూడా మంత్రులు చేసిన ఘనత జగన్ దేనన్న అంబటి
- పవన్ ను ఏపీ ప్రజలు నమ్మరని వ్యాఖ్యలు
పవన్ కల్యాణ్ కు బ్యానర్లు కట్టేందుకు ఎవరైనా వస్తే, పవన్ కల్యాణ్ వారిని చంద్రబాబుకు బ్యానర్లు కట్టాలని పంపిస్తున్నారని అంబటి రాంబాబు విమర్శించారు. ఇలాగైతే పవన్ కల్యాణ్ కు అభిమానులంటూ ఎవరూ మిగలరని అన్నారు. ఇప్పుడు క్యాడర్ కూడా జనసేనకు మిగలదని పేర్కొన్నారు.
తన తల్లిని తిట్టిన నారా లోకేశ్ ను ఎప్పటికీ క్షమించనని చెప్పిన పవన్ కల్యాణ్, ఇప్పుడదే లోకేశ్ ను వెంటేసుకుని తిరుగుతున్నాడని తెలిపారు. ఏపీలో టీడీపీ, జనసేన పొత్తు అనైతికం అని అంబటి రాంబాబు ధ్వజమెత్తారు.
చంద్రబాబుల, లోకేశ్ నాయకత్వంలో టీడీపీ ఎప్పుడో పతనమైపోయిందని, జనసేనకు 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులు లేరని అన్నారు. ఎప్పుడు ఏ మాట మాట్లాడతాడో పవన్ కే తెలియదని, అలాంటి వ్యక్తిని ఏపీ ప్రజలు నమ్మరని వ్యాఖ్యానించారు.