'ఆహా' ఫ్లాట్ ఫామ్ పైకి 'మా ఊరి పొలిమేర 2'

Polimera 2 OTT release date confirmed
  • నవంబర్ 3న విడుదలైన 'మా ఊరి పొలిమేర 2'
  • సక్సెస్ టాక్ తెచ్చుకున్న సినిమా ఇది 
  • ప్రధానమైన పాత్రలలో సత్యం రాజేశ్ - కామాక్షి భాస్కర్ల 
  • ఈ నెల 8వ తేదీ నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్

దెయ్యాలు .. ఆత్మలు వంటి నేపథ్యంలో వచ్చే హారర్ థ్రిల్లర్ సినిమాలను ఆడియన్స్ భయపడుతూనే చూస్తారు. ఈ తరహా కంటెంట్ ఉన్న సినిమాలను యూత్ ఎక్కువగా ఇష్టపడుతుంది. ఇక చేతబడుల నేపథ్యంలో వచ్చే సినిమాలను మాత్రం పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే అందుకోసం జరిగే తతంగాన్ని చూడటానికి చాలామంది ఇష్టపడరు. అలాంటి ఒక కంటెంట్ తో ఆ మధ్య వచ్చిన 'మా ఊరి పొలిమేర' సినిమా సక్సెస్ అయింది. 

ఆ సినిమాకి సీక్వెల్ గా రూపొందిన 'మా ఊరిపొలిమేర 2' నవంబర్ 3వ తేదీన విడుదలైంది. ఫస్టు పార్టు ఓటీటీలో రిలీజ్ కాగా, సెకండు పార్టు థియేటర్స్ కి రావడం విశేషం. గౌరీకృష్ణ నిర్మించిన ఈ సినిమాకి అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహించాడు. 'సత్యం' రాజేశ్ .. కామాక్షి భాస్కర్ల .. బాలాదిత్య ప్రధానమైన పాత్రలను పోషించారు. ఆ సినిమా ఈ నెల 8వ తేదీ నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్ కానుంది. అందుకు సంబంధించిన పోస్టర్ ను కొంతసేపటి క్రితం రిలీజ్ చేశారు. 

సాధారణంగా కొన్ని గ్రామాల్లో క్షుద్ర శక్తులు .. క్షుద్ర పూజలు .. నిధిని గురించిన ప్రచారాలు .. బలి అంటూ జరిగే హడావిడి .. ఎవరిపై అయితే అనుమానం వచ్చిందో, వాళ్లు ఊరొదిలి పారిపోవడం గురించిన వార్తలు పేపర్లో కనిపిస్తూ ఉంటాయి. అలాంటి సంఘటనలలో నుంచి పుట్టుకొచ్చిన కథనే ఇది. ఓటీటీ వైపు నుంచి ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ ను తెచ్చుకుంటుందో చూడాలి.
Advertisement
Sathyam Rajesh
Kamakshi Bhaskarla
Baladithya

More Telugu News