కాంగ్రెస్ గెలుపు కోసం శ్రమించిన, సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు: రేవంత్ రెడ్డి

Revanth Reddy thanks everyone who worked for Congress victory
  • ఎగ్జిట్ పోల్స్ తో కాంగ్రెస్ పార్టీలో ఫుల్ జోష్
  • నేతలు, కార్యకర్తలు, మిత్రులు, శ్రేయోభిలాషులందరికీ ధన్యవాదాలు తెలిపిన రేవంత్
  • మీ కష్టం, శ్రమ వృథా కాలేదని వ్యాఖ్య
తెలంగాణ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ లో ఎక్కువ సంస్థలు కాంగ్రెస్ కే పట్టం కట్టాయి. కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో విజయం సాధించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని ఎగ్జిట్ పోల్స్ ప్రకటించడం ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ ను నింపుతోంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సైతం గెలుపు తమదే అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆయన ఎక్స్ వేదికగా స్పందిస్తూ... తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం శ్రమించిన, సహకరించిన నాయకులు, కార్యకర్తలు, మిత్రులు, అభిమానులు, శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. గడచిన పదేళ్లుగా అడుగడుగునా అణచివేతలు, దాడులు, కేసులకు వెవరకుండా కాంగ్రెస్ చేసిన పోరాటంలో మీరంతా ప్రజల పక్షాన నిటారుగా, నికార్సుగా నిలబడ్డారని కొనియాడారు. మీ కష్టం, శ్రమ వృథా కాలేదని చెప్పారు. తెలంగాణలో ప్రజాస్వామ్య పునరుద్ధరణలో మీ అందరి పాత్ర మరువలేనిదని అన్నారు. ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తున్నానని చెప్పారు.
Go Back to Shorts
Revanth Reddy
Congress
Election Results

More Telugu News