ఎన్నికల్లో బీజేపీ తన శక్తిమేరకు సమర్థవంతంగా పని చేసింది: కిషన్ రెడ్డి
- బీఆర్ఎస్ అనేక ప్రాంతాల్లో ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిందని విమర్శలు
- ఒత్తిడిలోనూ పార్టీ కార్యకర్తలు గెలుపు కోసం ఎంతో కష్టపడ్డారన్న కిషన్ రెడ్డి
- కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించాయని ఆరోపణలు
- నాగార్జున సాగర్ వద్ద ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు డ్రామాలు ఆడాయని ఆగ్రహం
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించాయన్నారు. ఈ రెండు పార్టీలు కలిసి బీజేపీ శ్రేణులపై దాడి చేశాయని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ చాలా సమర్థవంతంగా, మాకున్న శక్తిమేరకు పని చేశామని, మంచి ఫలితాలు వస్తాయని ఆశాభావంతో ఉన్నామన్నారు. పోలింగ్ ఇంకా జరుగుతోందని, కాబట్టి పూర్తి సమాచారం రావాల్సి ఉందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పోటాపోటీగా డబ్బులు పంపిణీ చేశాయని ఆరోపించారు. యువత పెద్ద ఎత్తున బీజేపీకి మద్దతుగా నిలిచిందన్నారు. నిన్న నాగార్జున సాగర్ వద్ద జరిగిన ఘటన సరికాదన్నారు. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ, తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ డ్రామాలు ఆడినట్లుగా కనిపిస్తోందన్నారు.