రేణిగుంట చేరుకున్న చంద్రబాబు... ఎయిర్ పోర్టులో ఘనస్వాగతం పలికిన టీడీపీ శ్రేణులు
- తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చిన చంద్రబాబు
- రేణిగుంట ఎయిర్ పోర్టు వద్ద భారీ కోలాహలం
- ఈ రాత్రికి తిరుమలలో బస చేయనున్న టీడీపీ అధినేత
- రేపు ఉదయం కుటుంబ సమేతంగా శ్రీవారి దర్శనం
టీడీపీ నేతలు, కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు. చంద్రబాబు పార్టీ శ్రేణులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. చంద్రబాబు రోడ్డు మార్గం ద్వారా తిరుమల చేరుకోనున్నారు. ఈ రాత్రికి తిరుమలలో బస చేసి, రేపు ఉదయం వెంకటేశ్వరస్వామి దర్శనం చేసుకోనున్నారు. అనంతరం రేణిగుంట ఎయిర్ పోర్టుకు చేరుకుని విజయవాడ పయనం కానున్నారు.

