విజయకాంత్ చనిపోయారంటూ వస్తున్న వార్తలపై ఆయన భార్య స్పందన
- చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విజయకాంత్
- ఆయన చనిపోలేదన్న భార్య ప్రేమలత
- త్వరలోనే పూర్తిగా కోలుకుని బయటకు వస్తారని వెల్లడి
ప్రస్తుతం విజయకాంత్ చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు పల్మనరీ చికిత్స అందిస్తున్నామని చెప్పారు. విజయకాంత్ త్వరగా కోలుకుంటారని ఆశిస్తున్నామని తెలిపారు. గత 10 రోజులుగా ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఊపిరితిత్తుల సమస్యతో ఆయన బాధపడుతున్నట్టు తెలుస్తోంది.