హీరో నితిన్ కు ధోనీ నుంచి కానుక

Dhoni send surprise gift to hero Nithiin
  • నితిన్ కొత్త చిత్రం 'ఎక్స్ ట్రా... ఆర్డినరీ మేన్' 
  • డిసెంబరు 8న విడుదల
  • నితిన్ కు శుభాకాంక్షలు తెలిపిన ధోనీ
  • తాను సంతకం చేసిన జెర్సీని నితిన్ కు పంపిన క్రికెట్ లెజెండ్
టాలీవుడ్ హీరో నితిన్ ప్రస్తుతం 'ఎక్స్ ట్రా... ఆర్డినరీ మేన్' అనే చిత్రంలో నటిస్తున్నారు. వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ వినోదాత్మక చిత్రంలో నితిన్ సరసన శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రం డిసెంబరు 8న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. 

ఈ నేపథ్యంలో, నితిన్ కు టీమిండియా క్రికెట్ దిగ్గజం ఎంఎస్ ధోనీ నుంచి కానుక అందింది. 'ఎక్స్ ట్రా... ఆర్డినరీ మేన్' చిత్రం రిలీజ్ ను దృష్టిలో ఉంచుకుని నితిన్ కు శుభాకాంక్షలు చెబుతూ ధోనీ ఒక జెర్సీని పంపారు. ఆ జెర్సీపై ధోనీ సంతకం చేయడం విశేషం. 

ఈ విషయాన్ని నితిన్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. "ఎక్స్ ట్రార్డినరీ వ్యక్తిం నుంచి ఎక్స్ ట్రార్డినరీ గిఫ్ట్... ఈ జెర్సీ పంపినందుకు థాంక్యూ ధోనీ సర్... లవ్యూ" అంటూ నితిన్ ట్వీట్ చేశారు. అంతేకాదు, ధోనీ పంపిన జెర్సీ ఫొటోను కూడా పంచుకున్నారు.

Go Back to Shorts
Nithiin
Gift
MS Dhoni
Extra Ordinary Man
Tollywood

More Telugu News