Rushikonda: విశాఖ రుషికొండ తవ్వకాలపై హైకోర్టులో విచారణ

  • రుషికొండపై అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని ఆరోపణలు
  • నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుగుతున్నాయంటూ పిల్
  • హైకోర్టులో పిటిషన్ వేసిన వెలగపూడి రామకృష్ణబాబు, మూర్తి యాదవ్
  • విచారణ డిసెంబరు 27కి వాయిదా
High Court takes up hearing on PIL against constructions and digging at Rushikonda in Vizag

విశాఖలోని రుషికొండపై అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారని, నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు చేపడుతున్నారని రాజకీయ పక్షాలు గత కొన్నాళ్లుగా ఎలుగెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో, రుషికొండ తవ్వకాలు, నిర్మాణాలపై ఏపీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఈ పిల్ వేశారు. 

ఈ పిటిషన్ పై హైకోర్టు ధర్మాసనం నేడు విచారణ చేపట్టింది. ఇవాళ్టి విచారణలో కేంద్ర ప్రభుత్వం కూడా వాదనలు వినిపించింది. రుషికొండ పరిస్థితులపై డిసెంబరు మొదటి వారంలో కేంద్ర పర్యావరణ, అటవీశాఖ పంపే బృందం పరిశీలన చేపడుతుందని కేంద్రం తరఫు న్యాయవాది వివరించారు. ఆ బృందం రుషికొండ పరిస్థితులపై నివేదిక రూపొందించి సమర్పిస్తుందని తెలిపారు. వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను డిసెంబరు 27వ తేదీకి వాయిదా వేసింది.

More Telugu News