Charlie Munger: ప్రముఖ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ వ్యాపార భాగస్వామి చార్లీ మంగర్ కన్నుమూత

  • ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచినట్టు ప్రకటించిన చార్లీ కుటుంబసభ్యులు
  • చార్లీ మరణంపై బఫెట్ సంతాపం
  • బర్క్‌షైర్ హాథ్‌వే ఎదుగుదలలో చార్లీది కీలక పాత్ర అని ప్రకటన
Charlie Munger Warren Buffetts Longtime Business Partner Dies At 99

ప్రముఖ బిలియనీర్ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ స్నేహితుడు, వ్యాపార భాగస్వామి అయిన చార్లీ మంగర్(99) కన్ను మూశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్టు ఆయన కుటుంబసభ్యులు ప్రకటించారు. వారెన్ బఫెట్, చార్లీలు మంచి స్నేహితులు. కొన్ని దశాబ్దాల పాటు వారి స్నేహ బంధం కొనసాగింది. వారెన్ బఫెట్ స్థాపించిన బర్క్‌షైర్ హాథ్‌వేలో చార్లీ వైస్ ప్రెసిడెంట్‌గా సేవలందించారు. చార్లీ భాగస్వామ్యం, స్ఫూర్తి లేనిదే బర్క్‌షైర్ హాథ్‌‌వే ఇంతగా అభివృద్ధి చెందేది కాదని వారెన్ బఫెట్ ఓ ప్రకటనలో తెలిపారు. 

1959లో తొలిసారిగా చార్లీ, బఫెట్ ఒకరికొకరు పరిచయమయ్యారు. అప్పుడు మొదలైన వారి స్నేహ బంధం ఏకంగా 6 దశాబ్దాల పాటు సాగింది. 1978లో చార్లీ బర్క్‌షైర్‌ హాథ్‌వేలో వైస్ చైర్మన్‌గా చేరారు. బఫెట్‌తో కలిసి ఆయన.. చిన్న టెక్స్‌టైల్ కంపెనీగా ఉన్న హాథ్‌వే బర్క్‌షైన్‌ను ఓ భారీ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థగా అభివృద్ధి చేశారు.

More Telugu News