సింగమోలే కదిలినాడు... రేవంత్ రెడ్డి పాటకు స్టెప్పులేసిన ప్రియాంక గాంధీ... ఇదిగో వీడియో
- జహీరాబాద్‌లో కార్నర్ మీటింగ్‌లో పాల్గొన్న ప్రియాంకగాంధీ, రేవంత్ రెడ్డి
- మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు... అనే పాట
- చప్పట్లు కొడుతూ స్టెప్పులేసిన కార్యకర్తలు
అంతకుముందు ప్రియాంకగాంధీ మాట్లాడుతూ... దొరల తెలంగాణ కావాలా.. ప్రజల తెలంగాణ కావాలా? ప్రజలు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. దేశంలో ఫామ్‌హౌస్‌లో ఉండి పాలించే ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని విమర్శించారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా అసదుద్దీన్ ఓవైసీ పోటీ చేస్తారని.. కానీ తెలంగాణలో మాత్రం అన్నిచోట్ల పోటీ చేయడం లేదని మండిపడ్డారు. అక్రమాలతో దేశంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ ధనిక పార్టీలుగా మారాయని ఆరోపించారు. తెలంగాణలో అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు.