టీమిండియాతో చివరి రెండు టీ20లకు జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా

Australia announces team for last two T20 matches against Team India
  • ఇటీవల ముగిసిన వరల్డ్ కప్
  • టీమిండియా, ఆసీస్ జట్ల మధ్య టీ20 సిరీస్
  • స్వదేశానికి వెళ్లిపోతున్న పలువురు ఆసీస్ ఆటగాళ్లు
వరల్డ్ కప్ ముగిశాక టీమిండియా, ఆస్ట్రేలియా జట్లు 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ ఆడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు రెండు టీ20 మ్యాచ్ లు జరగ్గా... రెండింట్లోనూ నెగ్గిన టీమిండియా సిరీస్ లో 2-0తో ఆధిక్యంలో ఉంది. 

కాగా, వరల్డ్ కప్ ఆడేందుకు వచ్చిన ఆస్ట్రేలియా జట్టు గత రెండు నెలలుగా భారత్ లోనే ఉంది. ఈ నేపథ్యంలో, టీ20 జట్టులోని పలువురు ఆసీస్ ఆటగాళ్లు స్వదేశానికి వెళ్లిపోతున్నారు. వరల్డ్ కప్ జట్టులో సభ్యులైన స్టీవ్ స్మిత్, ఆడం జంపా నేడు ఆస్ట్రేలియా వెళ్లిపోతుండగా... నేడు మూడో టీ20 ముగిసిన తర్వాత మ్యాక్స్ వెల్, స్టొయినిస్, షాన్ అబ్బాట్, జోష్ ఇంగ్లిస్ స్వదేశానికి వెళ్లిపోనున్నారు. 

ఈ నేపథ్యంలో, చివరి రెండు టీ20లకు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. ప్రపంచకప్ గెలిచిన జట్టులోని ట్రావిస్ హెడ్ ఒక్కడే టీ20 జట్టులో కొనసాగుతున్నాడు. డిసెంబరు 3తో టీ20 సిరీస్ ముగియనుంది.

ఆస్ట్రేలియా జట్టు...
మాథ్యూ వేడ్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, ఆరోన్ హార్డీ, బెన్ మెక్ డెర్మట్, టిమ్ డేవిడ్, జోష్ ఫిలిప్పే, తన్వీర్ సంఘా, బెన్ డ్వార్షూయిస్, నాథన్ ఎల్లిస్, క్రిస్ గ్రీన్, కేన్ రిచర్డ్సన్, జాసన్ బెహ్రెండార్ఫ్.
Go Back to Shorts
Australia
Team
T20 Series
Team India

More Telugu News