వర్మ తరువాత ఫార్ములా అన్న దానిని పక్కన పెట్టేసిన డైరెక్టర్ సందీప్ రెడ్డి: రాజమౌళి
- హైదరాబాదులో 'యానిమల్' ఈవెంట్
- ముఖ్య అతిథిగా హాజరైన రాజమౌళి
- తన ఫేవరేట్ హీరో రణ్ బీర్ కపూర్ అని వెల్లడి
- సందీప్ వంగా సినిమా ఫార్ములాను మార్చేశాడని వ్యాఖ్య
"ప్రతి ఏడాది కొత్త దర్శకులు వస్తారు .. సూపర్ హిట్ సినిమాలు తీస్తారు .. ఎంతో పేరు తెచ్చుకుంటారు. ఒకే ఒక్క సినిమాతో ... సినిమా అంటే ఇలాగే తీయాలనే ఫార్ములాను షేక్ చేసిన డైరెక్టర్స్ మాత్రం అరుదుగా వస్తుంటారు. అలా మన తరంలో వచ్చిన దర్శకులలో ఒకరు రామ్ గోపాల్ వర్మ అయితే, ఆ తరువాత .. నేను ఇలాగే సినిమా తీస్తాను అంటూ వచ్చిన డైరెక్టర్ మరొకరు సందీప్ రెడ్డి వంగా" అని అన్నారు.
'యానిమల్' తాలూకు ఫస్టు టీజర్ చూడగానే .. ఈ సినిమాను తప్పకుండా చూడాలని అనుకున్నాను. టీజర్ నాకు అంతగా నచ్చింది. బాలీవుడ్ లో నా ఫేవరేట్ హీరో ఎవరని చాలామంది చాలా సార్లు అడిగారు. అందరికీ నేను చెప్పింది ఒకటే మాట. నా ఫేవరేట్ హీరో రణ్ బీర్ కపూర్. డిసెంబర్ 1వ తేదీన ఈ సినిమా విడుదలవుతోంది" అని చెప్పారు.