ముంబైకి వెళ్లిపోయిన పాండ్యా.. శుభ్‌మన్ గిల్‌కు భలే చాన్స్!
- క్యాష్ డీల్‌లో భాగంగా పాండ్యాను దక్కించుకున్న ముంబై ఇండియన్స్
- శుభమన్ గిల్‌కు పగ్గాలు అందించే యోచనలో గుజరాత్ ఫ్రాంచైజీ
- వార్తలపై స్పందించని టైటాన్స్ జట్టు
నిజానికి గుజరాత్ రిటెన్షన్ జాబితాలో హార్దిక్ పేరు ఉన్నప్పటికీ అనూహ్యంగా నగదు ఒప్పందంలో భాగంగా పాండ్యాను ముంబై ఇండియన్స్ దక్కించుకుంది. ఈ నేపథ్యంలో గుజరాత్ జట్టు కెప్టెన్సీ పగ్గాలను గిల్ చేపట్టబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో అటు ఫ్రాంచైజీ నుంచి కానీ, ఇటు గిల్ నుంచి ఎలాంటి ప్రకటన లేదు.