ఆమె కాలంలో ఘోరమైన పరిస్థితులు ఉండేవి: కేసీఆర్
- ఖానాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి జాన్సన్ నాయక్ డబ్బుల కోసం రాజకీయాల్లోకి రాలేదన్న కేసీఆర్
- తాను పిలిస్తేనే రాజకీయాల్లోకి వచ్చారని వెల్లడించిన ముఖ్యమంత్రి
- ఖానాపూర్‌ను కేటీఆర్ దత్తత తీసుకుంటానని చెప్పారన్న కేసీఆర్
ఖానాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి జాన్సన్ నాయక్ డబ్బుల కోసం రాజకీయాల్లోకి రాలేదని, ఆయనకు దేవుడు చాలా డబ్బులు ఇచ్చాడని, అమెరికాలో సాఫ్ట్ వేర్ కంపెనీ ఉందని తెలిపారు. తాను పిలిస్తేనే ఆయన రాజకీయాల్లో వచ్చారన్నారు. జాన్సన్ నాయక్‌ను గెలిపిస్తే ఖానాపూర్ నియోజకవర్గంలో బ్రహ్మాండమైన అభివృద్ధి జరుగుతుందన్నారు. కాంగ్రెస్ గెలిచేది లేదు.. సచ్చేది లేదని దాని పని మటాష్ అని వ్యాఖ్యానించారు.
బీఆర్ఎస్ ఈ పదేళ్లలో ఏం చేసిందో ఆలోచించి... ప్రజలు ఓటు వేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీకి పొరపాటున కూడా ఓటు వేయవద్దని హెచ్చరించారు. "జాన్సన్ నాయక్ నా కొడుకు రామ్ (కేటీఆర్) కు క్లాస్‌మేట్. మొన్న రామ్ ఇక్కడికి వచ్చినప్పుడు ఖానాపూర్‌ను దత్తత తీసుకుంటానని చెప్పినట్లు తెలిసింది. ఇక రామారావు దత్తత తీసుకున్నాక మీకేం తక్కువవుతుంది? కాబట్టి మీరు జాన్సన్ నాయక్‌కు ఓటేస్తే నాకు వేసినట్టే లెక్క. మంచి మెజారిటీతో జాన్సన్ నాయక్‌ను గెలిపించండి" అని కోరారు. నీలాంటి యువకుల వల్ల ప్రజలకు మంచి జరుగుతుందని చెబితే జాన్సన్ నాయక్ రాజకీయాల్లోకి వచ్చారన్నారు.