Ayyanna Patrudu: మాదంతా డైరెక్టే... మీలాగా చీకటి రాజకీయం చేయం: విజయసాయికి అయ్యన్న కౌంటర్

తెలంగాణలో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ర్యాలీలో టీడీపీ వాళ్లు జెండాలు పట్టుకుని పాల్గొనడానికి సిగ్గుండాలి అంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. అరేయ్ బ్రోకర్ సాయిరెడ్డీ అంటూ విరుచుకుపడ్డారు. మద్దతు ఇవ్వాలి అనుకుంటే డైరెక్ట్ గానే ఇస్తాం, మీలాగా అందితే జుట్టు, అందకపోతే కాళ్లు మా సిద్ధాంతం కాదు అని స్పష్టం చేశారు. 

"టీడీపీ తెలంగాణలో పోటీ చేయడం లేదు అని ప్రకటించింది. టీడీపీ సానుభూతిపరుల ఓట్లు కావాలి అనుకున్న అన్ని పార్టీ నాయకులు చంద్రబాబు అక్రమ అరెస్ట్ ను ఖండిస్తూ, కండువా కప్పుకుని మరీ ప్రచారం చేస్తున్నారు. మీ దొంగ నాయకుడిలా చెల్లితో ఒక పార్టీ పెట్టించి కాంగ్రెస్ కు మద్దతు తెలిపే చీకటి రాజకీయం మేం ఎప్పుడూ చేయం" అంటూ అయ్యన్నపాత్రుడు ఉద్ఘాటించారు.
Ayyanna Patrudu
Vijayasai Reddy
TDP
Priyanka Gandhi
Congress
YSRCP
Andhra Pradesh
Telangana

More Telugu News