యూపీలో అదానీ గ్రూపునకు చెందిన గోదాంలో భారీ అగ్నిప్రమాదం
- సహరన్ పూర్ లో ఘటన
- గత అర్ధరాత్రి అగ్నిప్రమాదం
- బాంబుల్లా పేలిన నూనె, నెయ్యి డబ్బాలు
- భయాందోళనలకు గురైన స్థానికులు
అగ్నిప్రమాదం కారణంగా నెయ్యి, నూనె డబ్బాలు పెద్ద శబ్దంతో విస్ఫోటనం చెందడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. గత అర్ధరాత్రి నుంచి మొదలైన మంటలు క్రమంగా గోదాం మొత్తానికి వ్యాపించాయి.
ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ 12 ఫైరింజన్లను రంగంలోకి దింపింది. పొరుగు జిల్లాల నుంచి కూడా ఫైరింజన్లను, అగ్నిమాపక సిబ్బందిని రప్పించారు. మంటల కారణంగా తీవ్రస్థాయిలో పొగ రావడంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఈ గోదాంలో తీవ్రస్థాయిలో ఆస్తి నష్టం జరిగినట్టు అంచనా వేస్తున్నారు.