Perni Nani: పవన్ పై పేర్ని నాని మరోసారి ఘాటు విమర్శలు

  • డబ్బులు లేని పవన్ ప్రత్యేక విమానాల్లో ఎలా వస్తారన్న పేర్ని నాని
  • జగన్ పై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారని మండిపాటు
  • కాపులను పవన్ ఏనాడైనా మనుషులుగా చూశారా అని విమర్శ
Perni Nani fires on Pawan Kalyan

జనసేన అధినేత పవన్ కల్యాణ్ మత్స్యకారులకు పంచిన డబ్బుల కంటే ఆయన వెళ్లి వచ్చిన విమానం ఖర్చులే ఎక్కువని వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని విమర్శించారు. తన దగ్గర డబ్బులు లేవని పవన్ చెపుతుంటారని... కానీ ఆయన వద్ద చాలా డబ్బులు ఉన్నాయని అన్నారు. డబ్బులు లేని వ్యక్తి ప్రత్యేక విమానాల్లో ఎలా వస్తారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్ పై విమర్శలు గుప్పించడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. మత్స్యకారులకు జగన్ ఏమీ చేయలేదని అంటున్నారని... జగన్ సీఎం అయిన తర్వాతే 10 ఫిషింగ్ హార్బర్లు మంజూరయ్యాయని, వాటి పనులు జరుగుతున్నాయని చెప్పారు.   

2014 నుంచి 2019 వరకు చంద్రబాబు, మీరు కలిసి ఒక్క ఫిషింగ్ హార్బర్ అయినా కట్టారా? అని పేర్ని నాని ప్రశ్నించారు. కాపులను పవన్ ఏనాడైనా మనుషులుగా చూశారా? అని అడిగారు. ఓట్ల కోసం చంద్రబాబు, పవన్ మాయ చేస్తున్నారని విమర్శించారు. బేగంపేటలో విమానాన్ని ఆపేయించారని పవన్ అంటున్నారని... విమానం ఆపితే ఎలా వచ్చారని ప్రశ్నించారు. 

More Telugu News