తెలంగాణలో రైతుబంధు సాయం పంపిణీకి అనుమతించిన ఎన్నికల సంఘం
- అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అమల్లో ఉన్న ఎన్నికల కోడ్
- రైతుబంధు సాయానికి అనుమతివ్వాలని ఈసీని కోరిన ప్రభుత్వం
- పథకం పాతది కావడంతో పంపిణీకీ అనుమతించిన ఎన్నికల సంఘం
దీనిని పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఇది పాత పథకం కావడంతో రైతుబంధు సాయం పంపిణీకి అనుమతి ఇచ్చారు. దీంతో త్వరలో రైతుల ఖాతాల్లో రైతుబంధు మొత్తం జమ కానుంది. ఈ నెల 28వ తేదీ లోపు మాత్రమే రైతుల ఖాతాల్లో ఈ మొత్తాన్ని జమ చేయాలని ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.