ఆనంద్ మహీంద్రా సామాజిక స్పృహ... ఓ వ్యక్తికి జరిమానా
- ముంబయి సముద్రంలో చెత్తను పారవేసిన వ్యక్తులు
- సామాజిక మాధ్యమాల్లో వీడియో
- ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ ను ట్యాగ్ చేసిన ఆనంద్ మహీంద్రా
- చెత్తను పారవేసిన వ్యక్తిని గుర్తించి రూ.10 వేల జరిమానా వేసిన బీఎంసీ
ఆనంద్ మహీంద్రా ఆశ్చర్యకరమైన వీడియోలు, ప్రతిభావంతుల వీడియోలను మాత్రమే కాదు, ఇలాంటి వీడియోలను కూడా ప్రత్యేక దృష్టితో పరిశీలిస్తారు. సామాజిక స్పృహ మెండుగా ఉన్న ఆనంద్ ఈ వీడియోను తేలిగ్గా తీసుకోలేకపోయారు.
వెంటనే ముంబయి నగర పాలక సంస్థ బీఎంసీని ట్యాగ్ చేస్తూ వీడియోను రీట్వీట్ చేశారు. మౌలిక సదుపాయాలు బాగుండడం కాదు... ముందు మన అలవాట్లు మార్చుకోవాలి... అప్పుడు సానుకూల మార్పు వస్తుంది అని ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు.
ఆనంద్ మహీంద్రా అంతటి వ్యక్తి తమను ట్యాగ్ చేయడంతో బీఎంసీ ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించింది. ట్యాక్సీ నెంబరు ఆధారంగా ఆ చెత్తను పారవేసిన వ్యక్తుల్లో ఒకరిని హాజీ అబ్దుల్ రహమాన్ షా ఖాద్రీ అని గుర్తించింది. అతడికి రూ.10 వేల జరిమానా విధించింది.