Palnadu: పల్నాడు జిల్లాలో అర్ధరాత్రి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి దారుణ హత్య.. లొంగిపోయిన కోడలు

Three family members murdered in Palnadu dist
షార్ట్స్‌లో చూడండి
పల్నాడు జిల్లా పిడుగురాళ్ల సమీపంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. కోనంకి గ్రామంలో గత రాత్రి జరిగిన ఈ హత్యలు సంచలనం రేపాయి. కుటుంబ తగాదాల నేపథ్యంలో బంధువులే వారిని కత్తులతో దారుణంగా నరికి చంపారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

మృతులను సాంబశివరావు (50), ఆయన భార్య ఆదిలక్ష్మి (47), వారి కుమారుడు నరేశ్ (30)గా గుర్తించారు. హత్యల అనంతరం సాంబశివరావు కోడలు మాధురి, ఇతర నిందితులు పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Go Back to Shorts
Palnadu
Piduguralla
Konanki Village
Andhra Pradesh
Crime News

More Telugu News