అందం అంటే ఇదే ... మెహ్రీన్ లేటెస్ట్ పిక్స్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అందం అంటే ఇదే ... మెహ్రీన్ లేటెస్ట్ పిక్స్!

Mehreen Special
  • తొలి సినిమాతోనే మెప్పించిన మెహ్రీన్ 
  • గ్లామర్ పరంగా ఆకట్టుకున్న బ్యూటీ 
  • వరుసగా వచ్చిపడిన సక్సెస్ లు 
  • మరికొంతకాలం ఆమెకి ఢోకా లేనట్టే  

తెలుగు తెరకి కొంతకాలం క్రితం పరిచయమైన కథానాయికలలో మెహ్రీన్ ఒకరు. టాలీవుడ్ లో నిలదొక్కుకున్న పంజాబీ బ్యూటీలు చాలా తక్కువమందే అని చెప్పాలి. కానీ మెహ్రీన్ మాత్రం కెరియర్ ఆరంభంలోనే వరుస విజయాలను అందుకుంటూ దూసుకెళ్లింది. అదృష్టం కలిసి రావడంతో, వరుస అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి.మెహ్రీన్ తన తొలి సినిమాతోనే గ్లామర్ పరంగా మంచి మార్కులు కొట్టేసింది. ఆ సినిమాతో ఆమె అభిమానులుగా మారిపోయినవాళ్లు ఎక్కువ. ఆకర్షణీయమైన కనుముక్కు తీరు .. చక్కని మేనిఛాయ కుర్రాళ్లను కట్టిపడేసింది. ఆమె పోషించిన గ్లామరస్ పాత్రల ప్రభావం యూత్ పై ఎక్కువగా కనిపించింది. అలాంటి మెహ్రీన్ కొన్ని కారణాల వలన కాస్త వెనకబడింది. అయితే తిరిగి తెలుగులో బిజీ కావడానికి ట్రై చేస్తూనే, మిగతా భాషల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. తాజాగా ఆమె ఫోటో షూట్ కి సంబంధించిన పిక్స్ వచ్చాయి. లైట్ గ్రీన్ కలర్ డ్రెస్ లో ఆమె మరింత అందంగా మెరుస్తోంది. మెహ్రీన్ ఫిట్ నెస్ ... గ్లామర్ చూస్తుంటే, మరికొంత కాలం పాటు ఆమె కెరియర్ కి ఢోకా లేదనే అనిపిస్తోంది. 
Advertisement
Mehreen
Actress
Tollywood

More Telugu News