నన్నే ఆపుతావా?.. సంతోష్‌నగర్ సీఐపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ చిందులు
- చాంద్రాయణగుట్టలో అక్బరుద్దీన్ ప్రచారం
- సమయం మించిపోతుండడంతో గుర్తు చేసిన సీఐ
- ఆగ్రహంతో చిందులేసిన అక్బరుద్దీన్
- తనను ఆపే వ్యక్తి ఇంకా పుట్టలేదన్న అక్బరుద్దీన్
సీఐ ఆ మాట అనగానే అక్బరుద్దీన్ ఆగ్రహంతో ఊగిపోయారు. తన వద్ద కూడా వాచీ ఉందని, ఇంకా ఐదు నిమిషాల సమయం ఉందన్న అక్బరుద్దీన్.. తనను ఆపే వ్యక్తి ఇంకా పుట్టలేదని చెప్పారు. అవసరమైతే తాను ఇంకా మాట్లాడతానని, ఎలా అడ్డుకుంటారో చూస్తానని సవాలు విసిరారు. తాను కనుసైగ చేస్తే పరుగులు పెట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. కత్తిపోట్లు, బుల్లెట్ గాయాలు అయినంత మాత్రాన తన పని అయిపోలేదని, తనలో అదే దమ్ము ఉందన్నారు. అక్బరుద్దీన్‌తో పోటీపడేందుకు వస్తున్నారు.. రానీయండి ఎలా గెలుస్తారో చూద్దామని ప్రజలనుద్దేశించి ఆవేశంగా ప్రసంగించారు.