ప్రియాంకా నువ్వెవరి మాటా వినవు ... నీకు నేను చెప్పలేను: 'బిగ్ బాస్ హౌస్ లో శివాజీ ఆవేశం
- శివాజీని నామినేట్ చేసిన ప్రియాంక
- ఆమె తీరు పట్ల మండిపడిన శివాజీ
- అశ్వినిని నేరుగా నామినేట్ చేసిన బిగ్ బాస్
- ప్రశాంత్ కి దక్కిన ఎవిక్షన్ పాస్
"ప్రియాంకా, నువ్వు నన్ను నామినేట్ చేయాలనుకున్నావ్ .. చేసేయ్. నీతో నేను వాదన చేయలేను. నా వెనుక ఎవరేమన్నారో నాకు తెలిసింది. మీరు ఏమనుకుంటే అదే చేస్తారు. ఇక్కడ ఏం జరుగుతుందనేది బయటికి వెళ్లిన తరువాత మీకే తెలుస్తుంది. మీకు ఎంత చెప్పినా వినిపించుకోరు. నెక్స్ట్ వీక్ మళ్లీ మామూలే" అన్నాడు.
అతని గురించి నలుగురం మాట్లాడుకున్నామనీ, అలాంటప్పుడు ఆయన తనని మాత్రమే టార్గెట్ చేయడం కరెక్టు కాదని ప్రియాంక వాదించింది. 'నలుగురిని నామినేట్ చేసే అవకాశం లేదుకదా' అని శివాజీ అన్నాడు. హౌస్ లో పొరపాట్లపై పొరపాట్లు జరుగుతూనే ఉన్నాయి. నువ్వు ఎవరిమాటా వినవు .. అరిచేస్తావు. నువ్వు ఎంత వాదించినా నేను చెప్పేది ఇదే" అన్నాడు. ఇక అశ్వినిని బిగ్ బాస్ నేరుగా నామినేట్ చేయగా, 'ఎవిక్షన్ పాస్' ప్రశాంత్ కి దక్కింది.