కేసీఆర్‌కు మళ్లీ అవకాశమిస్తే ప్రగతి భవన్, ఫామ్‌హౌస్‌కే పరిమితం: ఈటల రాజేందర్

  • నాగర్ కర్నూలు జిల్లాలో ఈటల రాజేందర్ ఎన్నికల ప్రచారం 
  • కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే బీఆర్ఎస్‌కు వేసినట్లేనన్న ఈటల
  • కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులకు కూడా మాట్లాడే అవకాశం లేదని విమర్శలు
కేసీఆర్‌కు మళ్లీ అవకాశం ఇస్తే ఎప్పటిలాగే ప్రగతి భవన్, ఫామ్ హౌస్‌కే పరిమితమవుతారని బీజేపీ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే బీఆర్ఎస్‌కు వేసినట్లే అన్నారు. కాంగ్రెస్‌కు ఓటు వేసి వృథా చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారులకు కూడా మాట్లాడే అవకాశం లేదన్నారు. దళిత ముఖ్యమంత్రి, రేషన్ కార్డులు, దళితులకు మూడెకరాల భూమి, నిరుద్యోగ భృతి, ఇంటికో ఉద్యోగం అని చెప్పిన ముఖ్యమంత్రి ఏ హామీలనూ నెరవేర్చలేదన్నారు.

Etela Rajender
Telangana Assembly Election
BJP
KCR

More Telugu News