కేసీఆర్, కాంగ్రెస్ ఎక్కడ ఉంటే అక్కడ అవినీతి: బీజేపీ చీఫ్ జేపీ నడ్డా
- తెలంగాణ అభివృద్ధి కోసం ప్రధాని నరేంద్రమోదీ అధికంగా నిధులు కేటాయించారన్న జేపీ నడ్డా
- ఫరూక్ అబ్దుల్లా నుంచి వైఎస్ కుటుంబం వరకు దేశంలో కుటుంబ రాజకీయాలు ఉన్నాయని వెల్లడి
- తెలంగాణలోనూ కేసీఆర్ కుటుంబ రాజకీయాలు వచ్చాయన్న జేపీ నడ్డా
- ధరణి పోర్టల్ పేరుతో కేసీఆర్ పేదల భూములు దోచుకున్నారని ఆరోపణ
తెలంగాణలోని కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పునివ్వాలని కోరారు. బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. మోదీ ప్రజల కోసం పని చేస్తుంటే కేసీఆర్ సంతుష్టీకరణ కోసం పాలిస్తున్నారని విమర్శించారు. కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన 200 యూనిట్ల ఉచిత విద్యుత్ హామీ అమలు కావడం లేదన్నారు. తెలంగాణలో కేసీఆర్ 24 గంటల విద్యుత్ ఇస్తున్నారా? అని సభికులను ఉద్దేశించి ప్రశ్నించారు. కేసీఆర్ ఎక్కడ ఉంటే అక్కడ.. కాంగ్రెస్ ఎక్కడ ఉంటే అక్కడ.. అవినీతి రాజ్యమేలుతుందన్నారు.