కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచే స్థానాల్లో పోలీసుల దాడులు: మధుయాష్కీ గౌడ్ ఆరోపణ
- కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనే దాడులు చేస్తున్నారన్న మధుయాష్కీ
- పోలీసులు తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే అర్ధరాత్రి సోదాలు చేశారని ఆరోపణ
- మూడ్రోజుల క్రితం ఫిర్యాదు చేస్తే కనీసం స్పందించ లేదన్న మధుయాష్కీ
పోలీసుల తీరు నిబంధనలకు విరుద్ధంగా ఉందన్నారు. తాను మూడు రోజుల క్రితం ఫిర్యాదు చేస్తే కనీసం స్పందించ లేదని వాపోయారు. తన నివాసం, కార్యాలయాల్లో అసలు తనిఖీయే జరగలేదని ఏసీపీ స్థాయి అధికారి చెప్పడం విడ్డూరమన్నారు. మరోవైపు ఎలాంటి ఆదేశాలు లేకుండా పోలీసులు వచ్చారని రిటర్నింగ్ ఆఫీసర్ చెప్పారన్నారు. ఇలాంటి పోలీసులు ఉంటే ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగవన్నారు. మధుయాష్కీ... సీఈవో వికాస్ రాజ్‌ను కలిశారు. పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.